- Advertisement -
విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా):మండలంలోని అరమ జాకరవలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రేమ బంధు ఫౌండేషన్ సభ్యులు శనివారం భోజన ప్లేట్ లను అందజేశారు. విద్యార్థులకు ఈ రకమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా చదువుపై ఆసక్తి పెరిగి వారు మరింత ఉత్సాహంగా విద్య అభ్యసిస్తారని ఆ సంస్థ సభ్యులు రమేష్ పట్నాయక్ తెలియజేశారు.ఈ
కార్యక్రమం లో పి.ఆర్.టీ.యు జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పలరాజు,జిల్లా ఉపాధ్యక్షులు మండ్యగురు శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు టీ.కృష్ణ, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


