ఎమ్మార్వో నూతక్కి సురేష్ బాబు
విశాలాంధ్ర నందిగామ:-కార్యాలయ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలనే పరమావధిగా భావించి పనిచేయాలని తహసిల్దార్ నూతక్కి సురేష్ బాబు అన్నారు శనివారం ఆయన కార్యాలయంలో కార్యాలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలను అందించారు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు కలకుండా వారి యొక్క పని ముగిసే వరకు దృష్టి సారించి పని చేయాలని సూచించారు అనవసరంగా కార్యాలయం చుట్టూ ప్రజలను తప్పకుండా చూసుకోవాలని పబ్లిక్ తో మర్యాదగా సవినయంగా ఉంటూ ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ తమ యొక్క కార్యకలాపాలు ప్రజలకు అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు అలాగే ప్రభుత్వం అందించే పథకాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలని పెండింగ్ లేకుండా చూడాలని రెవెన్యూ అంశాలపై కులం కుశంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎవరైనా ప్రజల పట్ల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ అంజయ్య,సీనియర్ అసిస్టెంట్ పని కుమార్,వీణ కుమారి,ఆర్ ఐ లావణ్య, సర్వేయర్ బసవరాజు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు….


