Homeజిల్లాలుఅనంతపురంపరిశోధనాత్మక ఆలోచనలే ఆవిష్కరణలకు వేదిక :విశాల ఫెర్రర్

పరిశోధనాత్మక ఆలోచనలే ఆవిష్కరణలకు వేదిక :విశాల ఫెర్రర్

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: పరిశోధనాత్మక ఆలోచనలే ఆవిష్కరణలకు వేదిక అని అనంతపురం జిల్లా ఆర్. డి . టి మహిళా సాధికారిక డైరెక్టర్ విశాల ఫెర్రర్ పేర్కొన్నారు. పివికెకె డిప్లొమా కళాశాలలో ఘనంగా ప్రారంభమైన “స్వాధ్యాయ 2026 సదస్సును విశాల ఫెర్రర్, కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, ప్రిన్సిపల్ వైభవ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..విద్యార్థులలో సైన్సు పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, అన్వేషణా దృక్పథం పెరిగేందుకు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. శ్రీ బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డా . పల్లె వెంకట కృష్ణ కిషోర్ మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకొని భవిష్యత్తులో ప్రజల అవసరాలకు తగ్గట్టు శాస్త్ర సాంకేతికతను కొత్త పుంతలు తొక్కించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అకడెమిక్ డీన్ డా. వై. సంతోష్ కుమార్ రెడ్డి , పివికెకె ఐటీ కళాశాల ప్రిన్సిపల్ డా. బండి రమేష్ బాబు , కళాశాల ప్రిన్సిపాల్ డా. యం సుబ్బారావు , పివికెకె డిప్లొమా విభాగాధిపతులు , అధ్యాపక బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు