Homeజిల్లాలుఏలూరుఉప తహసీల్దారుగా ఎంపికైన సౌజన్య

ఉప తహసీల్దారుగా ఎంపికైన సౌజన్య

- Advertisement -

పారిశుద్ధ్య కుటుంబంలో పరిమళించిన విద్యా కుసుమం

విశాలాంధ్ర ఏలూరు:భారీ ఉద్యోగ లక్ష్యాలతో చదువులు ప్రారంభిస్తారు కొందరు విద్యార్థిని
విద్యార్థులు. మరికొందరు ఎలాంటి లక్ష్యాలు లేకుండా చదువుకుని చివర్లో ఎవరూ ఊహించని
విజయాలు అద్భుతమైన సాధిస్తుంటారు. ఈ రెండో కోవకు
చెందిన అమ్మాయి గురించి మనం తెలుసుకోబోతున్నాము.ఏలూరు నగర కార్పొరేషన్ లో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న కుటుంబం నుండి బండి సౌజన్య గ్రూప్ -2 ఉద్యోగం
సాధించిన తీరు అబ్బురపరుస్తుంది. విద్యలో ఎన్నో మెళుకువలు
కలిగివున్న సౌజన్య చదువు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.
కష్టపడే చదివితే అనుకున్నది సాధించడం ఎలాగో నిరూపించింది.

కష్టాలను అధిగమించుకుంటూ విజయ సాధన దిశగా..

ఏలూరు నగర కార్పొరేషన్ కు చెందిన బంగారు నాగన్న వీధి రెల్లి వీధి.కు చెందిన బండి నాగన్న, బండి భవాని దంపతుల కుమార్తె బండి సౌజన్య గురువారం విడుదలైన ఏపీపీఎస్ గ్రూప్ 2
ఫలితాల్లో విజయం సాధించింది. తల్లిదండ్రులు బండినాగన్న, భవాని, సోదరుడు సతీష్ కుమార్ పారిశుధ్య కార్మికులు. కుటుంబంలో,బంధువులలోఎవరూ కూడా ఉద్యోగాలు చేస్తున్న దాఖలాలు లేవు.అందరి మాదిరిగానే ఏదో చదువు చదివించి మంచి అబ్బాయికి ఇచ్చి వివాహము చేయాలని తండ్రి ఆలోచన. సోదరుడు మాత్రం తన చెల్లి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే ఉద్యోగం సాధించాలని తపన.కుటుంబం జీవనాధారం అంతంత మాత్రమే.నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నప్పటికీ ఏమాత్రం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పట్టుదలగా సౌజన్యను చదివించాలనే తపన.ఇలాంటి పరిస్థితుల్లో సౌజన్య పట్టుదలగా చదివి రెవిన్యూ శాఖలో ఉప తహసీల్దార్
ఉద్యోగం సాధించింది. సౌజన్య ఉప తహసీల్దారుగా ఎంపిక కావడం పట్ల ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా సమితి, యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు అలాగే ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)ఏలూరు నగర సమితి.ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు