Homeజిల్లాలుఅనంతపురంసాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి

సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి

- Advertisement -

ఫారెన్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్ బాబు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి. ఫారెన్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ. సురేష్ బాబు పేర్కొన్నారు. అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రెస్టో 2K26, 10 వ జాతీయ సాంకేతిక సదస్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం , అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు 10వ జాతీయ స్థాయి సాంకేతిక , సాంస్కృతిక సదస్సును కళాశాల చైర్మన్ అనంత రాముడు,కళాశాల ప్రిన్సిపాల్ డా. కుటాల శ్రీనివాసులు, డైరెక్టర్ ప్రారంభించారు.
పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, హ్యాకతాన్, టెక్నికల్ క్విజ్, కోడ్ తంత్ర, బ్లైండ్ కోడింగ్ వంటి అనేక సాంకేతిక పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభ, సృజనాత్మకత మరియు ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఉత్సాహంగా ప్రదర్శించారు.
కళాశాల ఛైర్మన్ ఎం. అనంత రాముడు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో కంప్యూటర్ వినియోగం వేగంగా పెరుగుతున్నందున అవకాశాలు కూడా విస్తృతంగా ఉన్నాయని, ప్రతి విద్యార్థి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఉద్యోగాన్ని సాధించాలని సూచించారు.
నైపుణ్యాభివృద్ధి సంచాలకులు డా. ఎం. సురేంద్ర నాయుడు మాట్లాడుతూ, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఉన్నత ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల లో అందిస్తున్నామని, జాతీయ స్థాయి సదస్సులు ఆ శిక్షణను ఆచరణలో చూపించే వేదికలుగా నిలుస్తున్నాయని తెలిపారు. వివిధ సాంకేతిక , సాంస్కృతిక పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు , సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డా. భార్గవి , అలైడ్ బ్రాంచెస్ విభాగాధిపతి ఏ. సంధ్యా రాణి , డీన్ – రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డా. ఎం. మురళీధర్ కుర్ని , అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు