విశాలాంధ్ర – కనేకల్: కనేకల్ మండలం కేంద్రంలో వీధి పశువులు, కుక్కల సంచారం రోజురోజుకూ పెరిగి ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన రహదారులపై పశువులు గుంపులుగా పడుకోవడం, కొట్లాడుకోవడం వల్ల వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.ఆదివారం రామనగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడిని వీధి కుక్క కరచడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీప మెయిన్ రోడ్డులో, దిగువగేరి పాత పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్ విగ్రహం పరిసరాల్లో ప్రతిరోజూపదుల సంఖ్యలో పశువులు రహదారికి అడ్డంగా పడుకొని కొట్లాడుకోవడం వల్ల పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు.వారం రోజుల క్రితం విద్యార్థులను కూడా పశువులు తరిమిన ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు.పంచాయతీ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ, వీధి పశువులను గోశాలకు తరలించే చర్యలు చేపట్టలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనేకల్లో వీధి కుక్కల, పశువుల బెడద..
- Advertisement -


