Homeవిభజన హామీలకు తిలోదకాలు

విభజన హామీలకు తిలోదకాలు

- Advertisement -

. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష
u ప్రత్యేక హోదా ఊసేలేదు
. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కేంద్రం మౌనం
. ఏపీని పట్టించుకోని కేంద్ర బడ్జెట్
. దేశవ్యాప్తంగా సామాన్యుల బతుకుపోరుకు భరోసా కరువు
. పన్ను పోటు యథాతథం
. మాటల గారడీతో సరిపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

విశాలాంధ్ర – సచివాలయం: కార్మికులు, కర్షకులతో పాటు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షి బడ్జెట్ తీవ్ర నిరాశే మిగిల్చింది. పెరిగిన నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు ఈ బడ్జెట్ ఎటువంటి తక్షణ ఉపశమనాన్ని ప్రకటించలేదు. వేతన జీవుల పాలిట ఈ బడ్జెట్ ఒక చేదు గుళికగా మారింది. గత ఏడాది ఉన్న రూ.12 లక్షల ఆదాయ పన్ను పరిమితిని మార్చకపోవడం చూస్తే… ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన ఖర్చులను ప్రభుత్వం పట్టించుకోనట్లే భావించాలి. పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేలు నుండి కనీసం లక్ష రూపాయలకు పెంచుతారని ఆశించిన ఉద్యోగులకు మొండిచేయే ఎదురైంది. చేతిలో నగదు పెరిగితేనే మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది, కానీ ప్రభుత్వం పన్నుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించి మధ్యతరగతి పట్ల తన ఉదాసీనతను చాటుకుంది. బడ్జెట్‌లో ప్రకటించిన ‘భారత్ విస్తార’, యూనివ ర్సిటీ టౌన్‌షిప్‌లు వంటి పథకాలు వినడానికి బాగానే ఉన్నా… ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులే. గ్యాస్ ధరలు, వంట నూనెలు, పెట్రోల్ ధరలపై ఎటువంటి నియంత్రణ చర్యలు ప్రకటించలేదు. స్మార్ట్ వ్యవసాయం పేరుతో హైటెక్ మాటలు చెప్పారు తప్ప, రైతులకు గిట్టుబాటు ధర ఇన్‌పుట్ సబ్సిడీల పై స్పష్టమైన హామీ లేదు. క్యాన్సర్ మందులపై సుంకాలు తగ్గించడాన్ని స్వాగతించాల్సిందే కానీ సామాన్యుడు ప్రతిరోజూ వాడే బీపీ, షుగర్ వంటి సాధారణ మందుల ధరల నియంత్రణపై బడ్జెట్ మౌనం వహించింది. ప్రతి జిల్లాలో హాస్టళ్లు, టౌన్‌షిప్‌ల పేరుతో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అంటే… సామాన్యుడికి విద్యను మరింత దూరం చేయడ మేనన్న విమర్శలు వస్తున్నాయి. చిన్న పరిశ్రమ లకు రూ.10 వేలు కోట్ల నిధి అనేది సముద్రంలో కాకి రెట్ట లాంటిదే. దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న చిన్న పరిశ్రమల అవసరాలకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోగా, మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఆదాయ పన్ను రాయితీ, గ్యాస్ ధరల తగ్గింపు, రైలు చార్జీల వెసులుబాటు కల్పించలేదు. విదేశీ యానానికి పన్ను తగ్గింపు, క్లిష్టమైన డిజిటల్ పథకాలు, భవిష్యత్తులో చేస్తామన్న హామీలు మాత్రమే.మొత్తంగా ఈ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు, విదేశాలకు వెళ్లే సంపన్నులకు మేలు చేసేలా ఉందే తప్ప, రోజువారీ బతుకు పోరాటం చేసే సామాన్యుడి ఇబ్బందులను అసలు పట్టించుకోలేదు. ఇది అంకెల గారడీ తప్ప పేదవాడి కడుపు నింపే బడ్జెట్ కాదని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం దాటుతున్నా, ఆంధ్రుల హక్కు అయిన ‘ప్రత్యేక హోదా’ పై ఈ బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేకపోవడం అత్యంత విచారకరం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్రం మరోసారి బుట్టదాఖలు చేసింది. ఏపీ విభజన హామీల అమలు అనేది దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన సున్నితమైన అంశం. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నది వాస్తవం. విభజన హామీలలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేకీVAదాపై కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను సాకుగా చూపుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతూ వస్తోంది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రతిపాదించింది. అయితే, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికీ దీనిపై పట్టుబడుతూనే ఉన్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే… దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ నిధుల విడుదల, నిర్మాణ పనుల జాప్యం వల్ల ఇది ఇంకా పూర్తి కాలేదు. ఇటీవలే కేంద్రం నిధుల విడుదలకు సానుకూలత చూపింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం విషయంలో మద్దతు ఇస్తామని ప్రకటించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం లభించినా, క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం కావాల్సి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. దీని భవిష్యత్తు కేంద్ర నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు అరకొరగా నిధులు కేటాయించడం మినహా ఇతర అంశాలపై ప్రస్తుత బడ్జెట్‌లో కనీసం ప్రస్తావన కూడా లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీలు కీలక పాత్ర పోషిస్తుండటంతో, పెండింగ్‌లో ఉన్న హామీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. నేరుగా హోదా పేరుతో కాకుండా వివిధ పథకాలు, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి నిధులు రాబట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విభజన హామీలన్నీ 100 శాతం నెరవేరడం అనేది కేవలం చట్టబద్ధమైన అంశం మాత్రమే కాదు, అది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే రాజకీయ సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోని వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ అందుతుందని ఆశించిన రాష్ట్రప్రజలకు నిరాశే మిగిలింది. అభివృద్ధి నిధుల కేటాయింపులో ఈ ప్రాంతాల పట్ల కేంద్రం ప్రదర్శించిన వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాల అమలుకు ఈ బడ్జెట్‌లో ఎటువంటి ప్రాధాన్యత లేదు. రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులకు నామమాత్రపు కేటాయింపులు, అసలు కేటాయింపులే లేకపోవడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇలాంటి తరుణంలో భారీ నిధుల కేటాయింపుల తోపాటు అదనపు రుణ పరిమితి వంటి వెసులుబాట్లు కల్పిస్తారని ఆశించిన ఐదు కోట్ల ఆంధ్రులకు ఈ బడ్జెట్ శరాఘాతంలా తగిలింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు. విభజన చట్టంలోని ప్రతి హామీని నిర్దిష్ట కాలపరిమితితో అమలు చేయాల్సి ఉంది. వెనుకబడిన జిల్లాలకు తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేయాలి. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో వాటా కోరుతున్న ఆంధ్రప్రదేశ్‌కు, తిరిగి ఇచ్చే విషయంలో మాత్రం కేంద్రం మొండిచేయి చూపుతోంది. రాజకీయ అవసరాల కోసం ఏపీని వాడుకోవడం తప్ప, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తోంది. ఇది ఆంధ్రులకు అన్యాయం చేసే బడ్జెట్ అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు