Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి

కేంద్ర బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి

- Advertisement -

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;;కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతకు కేవలం 200 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందని చేనేత, జోలి శాఖ రెండిటికి కలిపి 5272 కోట్లు కేటాంచడం జరిగిందని ఈ బడ్జెట్ లో చేనేతకు మొండి చేయి కల్పించడం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు విజయభాస్కర్,చేనేత నాయకులు చెన్నంపల్లి శ్రీనివాసులు,శ్రీధర్, శ్రీనివాసులు,శంకారపు రాజ, జింక కేశవ లతో కలసి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తర్వాత 69 లక్షల కుటుంబాలు పైగా ఉపాధి కల్పిస్తున్నటువంటి చేనేత పరిశ్రమకు కేవలం 200 కోట్లు కేటాయించడం చాలా దారుణం అన్నారు. గతంలో మహాత్మా గాంధీ బుంకర్ భీమా యోజన పథకం,కింగ్ క్యాలటి,డైయింగ్ ఎన్హెచ్డిసి మార్జిన్ మని స్కీమ్,చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీ క్రింద మగ్గం పరికరాలు ఇచ్చేవారని తెలిపారు. ఆర్ ఎస్ యు వై స్కీమ్ క్రింద మగ్గం షెడ్డు నిర్మాణాలకు సబ్సిడీ గతం లో ఇచ్చేవారని కానీ ఇప్పుడు చేనేత కార్మికులకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పథకం కూడా లేదు అని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో చేనేతకు జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలనీ ,చేనేత కార్మికులకు మగ్గం పరికరాలు పూర్తి సబ్సిడీ తో అంద చేసి చేనేత పరిశ్రమను కాపాడాలని వారు డిమాండ్ చేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు