ఏడి లక్ష్మీనరసింహారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం పుట్టపర్తి లోని గణేష్ సర్కిల్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ధర్మవరం విద్యుత్ ఏడి లక్ష్మీనరసింహ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ రిటైర్డ్ జడ్జ్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి, ఆర్థిక సభ్యులు మధు కుమార్, సాంకేతిక సభ్యులు శ్రీనివాస్ బాబు, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. ధర్మవరం డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను, దీర్ఘకాలిక సమస్యలను ఈ ప్రత్యేక విద్యుత్ అదాలతో తెలిపిన తప్పక పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ధర్మవరం, చెన్నై కొత్తపల్లి, సబ్ డివిజన్ పరిధిలో గల పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, ధర్మవరం మున్సిపాలిటీ, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలకు సంబంధించిన వారు పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ ప్రత్యేక విద్యుత్ అదాలతో డివిజన్ పరిధిలోని అధికారులు సిబ్బంది హాజరవుతారని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు రాతపూర్వక ఫిర్యాదు ద్వారా తెలియపరచాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈనెల 4న ప్రత్యేక విద్యుత్ అదాలత్..
- Advertisement -
RELATED ARTICLES


