- Advertisement -
సిడిపిఓ జయంతి
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి సాక్షము అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి రా మెటీరియల్ను కలెక్టర్, జిల్లా బీడీ ఆదేశాల మేరకు అందజేయడం జరిగిందని సిడిపిఓ జయంతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం లేకుండా స్టీల్ వాడడం కోసం ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసిన విషయాన్ని వారు తెలిపారు. కావున అంగన్వాడీ కేంద్రాల వారు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంగన్వాడీ కేంద్రాలకు మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.


