– బీఎస్పీ, డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం;; భూదాన భూములపై నిరుపేద మహిళలకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు దాదులూరు గ్రామం సర్వే నెంబర్ 508 , కనగానపల్లి మండలానికి చెందిన భూదాన భూముల సమస్యపై బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఆర్డీవో కార్యాలయంలో అందజేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా బీఎస్పీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ, భూదాన యజ్ఞబోర్డు ద్వారా 2013–14 సంవత్సరాలలో నిరుపేద మహిళలకు చట్టబద్ధంగా కేటాయించిన భూములకు ఇప్పటివరకు పాస్బుక్లు, 1-B ఎంట్రీలు ఇవ్వకపోవడం ఘోర అన్యాయమన్నారు. బాధిత మహిళలకు పూర్తిగా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.అదే విధంగా ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కేసుగాల వెంకటేష్ మాట్లాడుతూ, ఈ భూదాన భూముల విషయంలో ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, ప్రజలను అందరిని కలుపుకొని భూమి చేతికి వచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.“భూమి ఇవ్వడమా, భూమి తీసుకోవడమా మీ ఇష్టమేనా? ప్రభుత్వానికి చట్టాలు వర్తించవా?” అని ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. బాధితులు మాట్లాడుతూ ఈ భూమి వలన తమను భర్తలను కోల్పోయామని చంటి బిడ్డలతో ప్రభుత్వ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నామని ఇప్పటికైనా అధికారుల స్పందించి తమ భూమి తమకు ఇవ్వాలని వేడుకున్నారు .భూమి విషయం హైకోర్టులో ఈ కేసు ఉన్నదని అక్కడ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఏఐఐసీసీ వారు ఎటువంటి పనులు చేపట్టాలని ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆర్డిఓ ను బాధితులు నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ కార్యదర్శి హరి,రాచర్ల నారాయణస్వామి మరియు ఎంఆర్పీఎస్ నాయకులు ప్రదీప్, శ్రీను, రామిరెడ్డిపల్లి ఆనందు, బాధితులు పాల్గొన్నారు.
భూదాన భూములపై నిరుపేద మహిళలకు న్యాయం చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


