Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ ఉన్నత విద్యా విలువలు కాపాడండి

ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలు కాపాడండి

- Advertisement -

కే హెచ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలను కాపాడాలని కే హెచ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలకు వారు డిగ్రీ కళాశాలలో చేయవలసిన వాటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల లో చదవడం వలన తల్లి తండ్రులకు ఫీజుల బెడద ఉండదని, ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్నత విద్య నేర్చుకోవడానికి ఎంతో మంది ఇష్ట పడుతున్నారని తెలిపారు.కనుక విలువలు నేర్పించే ప్రభుత్వ విద్య నభ్యసించాలని వారు తెలిపారు. కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ హుమీరానుయుమ్, డాక్టర్.ఎస్. షామివుల్లా, ఏ. కిరణ్ కుమార్, డా.బి. గోపాల్ నాయక్, బి. ఆనంద్, బి. మీనా, పెద్దన్న, రామాంజుల రెడ్డి, మల్లికార్జున, ఇక్రంబాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు