Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదాత సవారు లక్ష్మణ్ రావు అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరంచంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పాండురంగస్వామి గుడి వీధి కి చెందిన అంబాభవాని దేవాలయం మాజీ అధ్యక్షులు కీ,శే సఫారు లక్ష్మణ రావు ఉదయం మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అన్నారు . నేత్రదానానికి సహకరించిన దాత భార్య జయలక్ష్మి, కుమారుడు శివరాం మూర్తి , కుమార్తె భారతి ,కోడలు చైతన్య, రామచంద్ర, రాచూరే సుధాకర్ రావు, నాగరాజు రావు, రిటైర్డ్ కరెంటు ఇంజనీర్ సురేష్ లకు సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాజుల సురేష్, ఉపాధ్యక్షులు టి చంద్రశేఖర్ రెడ్డి , జూజారు రఘు, జి ధనుంజయ, వెంకటేష్, కేశవరెడ్డి, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు