Homeజిల్లాలుకర్నూలురాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు చేపట్టాలి

రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు చేపట్టాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలోని రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు తీసుకోవాలని మంగళవారం ఇరిగేషన్ ఈఈకి వైసీపీ రైతు విభాగం తాలూకా అధ్యక్షులు కేపీ యల్లప్ప, నాయకులు బ్రహ్మయ్య ఆచారి, లింగన్న గౌడ్, బోయ కడబూరి ఆదోనిలో ఇరిగేషన్ ఈఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలచెరువు నుంచి దాదాపు 1000 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. చెరువు గట్టుపై ముళ్లకంపలు, పిచ్చి మొక్కలతో నిండిపోయిందన్నారు. చెట్లు వేర్లు పెద్దవై చెరువు గట్టు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కావున తక్షణమే ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువు గట్టుపై ఉన్న ముళ్ల కంపలను తొలగించి చెరువుకు భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు