Homeజిల్లాలుపశ్చిమ గోదావరికాపులంతా ఐక్యతగా వుండాలి

కాపులంతా ఐక్యతగా వుండాలి

- Advertisement -

విశాలాంధ్ర – తాళ్లపూడి : కాపులంతా ఐక్యతగా ఉండి, టీడీపీ ప్రభుత్వం కాపులపై చేస్తున్న దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని కాపు జెఏసి మెంబర్, పేద్దెవం ఉప సర్పంచ్ తోట రామకృష్ణ పిలుపు నిచ్చారు. ఆ నాటి రంగ హత్య, మొన్న ముద్రగడ కుటుంభం పై దాడి, నిన్నటి అంబటి పై దాడి వరుస గా రాష్ట్రం లో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ రాజకీయ వైరుధ్యం నడుస్తూనే, దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మాజీ మంత్రి అంబటి పై దాడి ని ఖండిస్తున్నామని అన్నారు. కాపులంతా ఏక దాటి పై ఉండి, మరో కాపు ఉద్యమానికి సన్నద్ధం కావాలని అన్నారు. ఈ సమావేశంలో వైకాపా లోని వివిధ పదవుల్లో ఉన్న కాపు ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు