– నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి యాదవ్ ఈనెల 6 వ,7 వ తేదీలలో ధర్మవరం నియోజకవర్గములో పర్యటిస్తున్నారని మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీ ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలములోని గుంజే పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న 22-ఏ ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం, మధ్యాహ్నం మూడు గంటలకు బత్తలపల్లి మండలం కేంద్రంలో నిర్వహిస్తున్న వీక్షిత్ భారత్ రోజ్ గార్, అజివికా మిషన్ గ్రామీణ పథకం అవగాహన సదస్సు, సాయంత్రం ఐదు గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో బిజెపి మండల అధ్యక్షుల సమావేశం ఉంటుందన్నారు. అనంతరం ఏడవ తేదీ శనివారం ఉదయం 10:30 నిమిషాలకు ధర్మవరం రూరల్ పరిధిలోని రావులచెరువులో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం అనంతపురంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. కావున ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు.


