– హిందూపూర్ పోస్టల్ సూపర్డెంట్ రెడ్డి భాష
విశాలాంధ్ర ధర్మవరం: తపాలా శాకద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను, తపాలా సేవలను ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాలని హిందూపురం పోస్టర్ సూపర్డెంట్ ఎన్ రెడ్డి భాషా తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన తపాలా శాఖ కార్యాలయమునకు చేరుకొని, అక్కడి ఉద్యోగస్తులు ప్రజలకు అందిస్తున్న సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి తపాలా పలు సేవలు గూర్చి, పోస్టల్ బీమా, ఆధార్, సుకన్య సమృద్ధి ఖాతాలు, విశ్వకర్మ పార్సిల్లు, పొదుపు ఖాతాలు, తపాలా శాఖ అభివృద్ధికి అనుసరించవలసిన విధి విధానాలను వారు తెలియజేశారు. అనంతరం ఈ తపాలా శాఖ పథకాలను ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించిన వారికి బ్యాగులను వారి చేతులమీదుగా బహుకరించారు. అంతేకాకుండా తపాలా శాఖ సేవలను పేద ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని, ఆ అవసరం మేరకు మరింత కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి. మల్లికార్జున,, హెడ్ పోస్ట్ మాస్టర్ భాను కుమార్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
తపాలా శాఖ ద్వారా వస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలి
- Advertisement -
RELATED ARTICLES


