Thursday, December 26, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిటిడిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

టిడిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : ప్రేమ కరుణ సేవకు ప్రతీక ఈ క్రిస్మస్ పండుగ అని నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జి మహేష్ చౌదరి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని గాంధీనగర్ లో టిడిపి పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు తాను నమ్మిన వారి కోసం బలిదానాలకు సైతం వెనుకాడని గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్ని అనుసరించి,ప్రేమ తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈర్ష ద్వేషాలను పూర్తిగా పక్కన పెట్టాలని పాపాలకు దూరంగా ఉండాలని క్రీస్తు సూచించిన మార్గాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి విజయ్ సారథి, పూల రామకృష్ణ,భాస్కర్ చౌదరి, ఏగినాటి రమణ, రాఘవ రెడ్డి మల్లెని పల్లి చంద్ర, అమర సుధాకర్, వాల్మీకి అశోక్, నారా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు