విశాలాంధ్ర ధర్మవరం;; వైద్యుల సేవలు వెలకట్టలేనివని, రోగులకు వైద్యమును అందించుటలో వారికి వారే సాటి అని ఇన్నర్ వీల్ క్లబ్ కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆసుపత్రిలో కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలోని 15 మంది వైద్యులను ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం క్లబ్ తరఫున గిఫ్ట్ లను కూడా అందజేశారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ వారు మాట్లాడుతూ భగవంతుని తర్వాత వైద్యున్ని దైవంతో సమానంగా ప్రజలు తరతరాలగా చూడటం జరుగుతోందని తెలిపారు. వైద్యం అంటే వృత్తిగా కాకుండా ప్రాణం నిలిపే బాధ్యతగా నేడు వైద్యులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి స్వస్థత కలిగించేందుకు వైద్యులు ఎంతో తపించడం జరుగుతుందని తెలిపారు. క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగులకు సైతం పునర్జన్మ ఇచ్చేందుకు ఆసుపత్రి బల్లపై చిన్నపాటి ఉద్యమే చేసి శభాష్ అనిపించుకునే సత్తా కేవలం వైద్యులకు మాత్రమే ఉంది అని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్, డాక్టర్ మాధవి తో పాటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తరపున ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు అంబిక ,ఆదిలక్ష్మి, మానస, సునీత తదితరులు పాల్గొన్నారు.
వైద్యుల సేవలు వెలకట్టలేనివి.. ఇన్నర్ వీల్ క్లబ్ కార్యదర్శి లక్ష్మి
- Advertisement -
RELATED ARTICLES


