విశాలాంధ్ర, ఘట్కేసర్ : కార్మీకుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుంది కేవలం ఎర్ర జెండా పార్టీలేనని ఏఐటియూసి రాష్ట్ర నాయకులు విఎన్ బోస్, కల్లూరి జయచంద్రలు అన్నారు. కార్మికుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ విధానాలను నీరసిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఘట్ కేసర్ పట్టణంలో సిఐటియు కార్యదర్శి చింతల యాదయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత, సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్. ఏఐటియూసిల ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ, అనంతరం మహాంకాళి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సభలో వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం 29గా ఉన్న లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికులకు కష్టాల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్ర జెండా పార్టీలు అధికారంలో లేకున్నా ప్రజలు మాత్రం తమ వెంటనే ఉన్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సివల్ వర్క్స్ర్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమౌళి, గాంధారీ అశోక్, చంద్రశేఖర్, అశోక్, ఎల్లమ్మ, మధ్యాహన భోజన కార్మికుల కార్యదర్శి కవిత, ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల కార్యదర్శి రాంచందర్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి నయ్యద్ ఖదీర్, జి అశోక్, మండల ఉపాధ్యక్షురాలు సునీత దేవి, ఎన్పీఆర్డి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలి
విశాలాంధ్ర, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఈ సమ్మెకు మద్దతు తెలుపుతూ సమ్మె కార్యక్రమంలో టిజిహెచఎంఈయు అధ్యక్షులు కె.బాలకృష్ణ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే ముఖ్యంగా జిహెచఎంసిలో ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరే రామ్, ఎల్లమ్మయ్య, సత్యనారాయణ, టింకు, మల్లేష్, నరసింహ, నవీద్లతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వామపక్ష, కార్మిక సంఘాల ర్యాలీ
విశాలాంధ్ర, ఎల్.బి.నగర్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ఏఐటీయూసీ అర్బన్ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో ఘనంగా సమ్మె కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఏఐటీయూసీ ఎల్బీనగర్ అధ్యక్షుడు బోయపల్లి రాములు గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సమ్మెలో భాగంగా చాకలి ఐలమ్మ చౌరస్తా నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమం అనంతరం పోలీసులు నాయకులను అరెస్టు చేసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల రాష్ట్ర నాయకుడు బొడ్డుపల్లి కృష్ణ, ఏఐఎసఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశి వర్ధన్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, హయత్ నగర్ మండల కార్యదర్శి శేషరాజు, పల్లి శ్రీదేవి, సహాయ కార్యదర్శులు మర్రి శోభన్, కర్నె సుజాత, మనసురాబాద్ డివిజన్ కార్యదర్శి కందుల సుధాకర్, మున్సిపల్ కార్మిక సంఘం ఎల్.బి.నగర్ నియోజకవర్గ కార్యదర్శి మద్దిలేటి, ఎనఎఫ్డబ్ల్యు హయత్ నగర్ మండల కార్యదర్శి కొప్పుల సరిత, డిపిహెచ్పిఎస్ ఎల్ బి నగర్ నియోజకవర్గ కార్యదర్శి పాల్వాయి సురేందర్, గూని శోభ తో పాటు ఏఐటీయూసీ నాయకులు, సీపీఐ కార్యకర్తలు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలిపారు.
సిపిఐ`సిపిఎం పార్టీల ర్యాలీ
విశాలాంధ్ర, మల్కాజిగిరి : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ శక్తుల బడా వ్యాపారవేత్తల అనుకూల విధానాలను నిరసిస్తూ కార్మిక కర్షక శ్రమజీవుల హక్కుల పరిరక్షణకై దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా మల్కాజిగిరిలో సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఆనంద్ బాగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి ర్యాలీ ప్రారంభించి మల్కాజిగిరి చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి టిడిపి కాంగ్రెస్ బీఎస్పీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగాసిపిఐ మండల కార్యదర్శి టి.యాదయ్య గౌడ్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాసర్ల నాగరాజు, సిపిఎం జిల్లా నాయకులు కోమటి రవి, మండల కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సిఐటియు నాయకులు బి.యాదగిరి, ఎస్.కే.అజీజ్, సయ్యద్, యూసఫ్, జె.వెంకటరమణ, విజయ్ కుమార్, కే.యాదగిరి, సట్ల ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు జీడి నవీన్ గౌడ్, టిడిపి నాయకులు వగ్గు చంద్రశేఖర్, కరణం గోపి, బీఎస్పీ నాయకులు గౌతమ్ రాజ్, మహిళలు పాల్గొన్నారు.
కార్మికుల పక్షాన పోరాడేది ఎర్ర జెండా పార్టీలు
- Advertisement -


