విశాలాంధ్ర, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు తొలగించి నాలుగు లేబర్ కోడులు తెచ్చి కార్మికులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చేందుకు ప్రభుత్వం కోరుకుంటున్నాను రద్దయేంత వరకు పోరాటం చేస్తామని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్త సందర్భంగా ఎల్బీనగర్ జోన్ ఏఐటీయూసీ మున్సిపల్ రంగం ప్రధాన కార్యదర్శి ఎం.మద్దిలేటి అధ్యక్ష తన జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు ఏఐటియుసి కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ పాలొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 130 సంవత్సరాల క్రితం ప్రాణ త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి 1925లో బ్రిటిష్ వారు ఉన్నప్పుడే 44 కార్మిక చట్టాలని సాధించుకోవడం జరిగింది. 29 కార్మిక చట్టాలను తొలగించి కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని, పబ్లిక్ సెక్టర్ అనేక లాభాల్లో ఉన్న అనేక సంస్థలను ప్రైవేటు సౌకుదారులకు దానతత్వం చేయడం అనేది జరుగుతుందని, ప్రభుత్వంలో ఆధీనంలో ఏ ఒక్క పని కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పేందుకు పూకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం ప్రైవేట్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ రోజు అనేక చట్టాలు మార్పులు చేస్తూ వ్యవస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ఇవన్నీటిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అశోక్, పద్మమ్మ, లక్ష్మి, ఇందిరా, లచ్చువమ్మ, ధనమ్మ, అండాలు, ఎల్లమ్మ, వెంకటమ్మ, పార్వతి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు లేబర్ కోడ్లను రద్దు
విశాలాంధ్ర, కాప్రా : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ విధానాలను నిరసిస్తూ నేడు తలపెట్టిన కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎంటీయూసీ,ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నాచారం చౌరస్తా నుండి ర్యాలీగా ప్రారంభించి, పారిశ్రామిక వాడల్లో ద్విచక్రవాహనాలపై నినాదాలు చేస్తూ పరిశ్రమలను బంద్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్. బోస్ మాట్లాడుతూ నూతనంగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల ఉద్యోగ భద్రత, వేతన హక్కులు, సంఘటిత హక్కులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. సంస్థలకు కార్మికులను సులభంగా తొలగించే అవకాశాలు పెరగడం, పని గంటలు పెరిగే అవకాశాలు ఉండటం, కనీస వేతనాల విషయంలో అనిశ్చితి ఏర్పడటం వంటి అంశాలు కార్మిక వర్గానికి పెద్ద ముప్పుగా మారతాయని తెలిపారు. ట్రేడ్ యూనియన్ హక్కులు బలహీనపడే విధంగా రూపొందించిన ఈ చట్టాలు ప్రజాస్వామ్య హక్కులపై కూడా దాడి చేస్తున్నాయని విమర్శించారు.ప్రత్యేకంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు మరియు వలస కార్మికులు అత్యంత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తక్కువ వేతనాలు, అసురక్షిత పని వాతావరణం, ఆరోగ్య భద్రత లేకుండా జీవిస్తున్న కార్మికులకు ఈ చట్టాలు మరింత భారంగా మారతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు మరియు చిన్న పరిశ్రమల కార్మికులు అత్యధికంగా నష్టపోతారని వివరించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ విధానాలు, సామాజిక అసమానతల నేపథ్యంలో ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ కార్మిక హక్కులను బలహీనపరచడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విమర్శించారు. కార్మిక వర్గం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నప్పటికీ, వారి జీవన భద్రతను పట్టించుకోకుండా విధానాలు రూపొందించడం సామాజిక న్యాయానికి ప్రమాదకరమని తెలిపింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరు ధర్మేంద్ర, సీపీఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్య ప్రసాద్,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, ఐఎన్టీయూసీ జిల్లా నేత ప్రకాష్ రెడ్డి,ఐఎఫ్టీయూ నాయకురాలు అనురాధ ప్రధాన నాయకత్వం వహించగా… కార్మిక సంఘాల నేతలు గిరిబాబు, రాజ్ కుమార్,కృపాకర్, స్వామిదాస్,నర్సింగరావు, శ్రీనివాస్,నర్సింహా,మహేష్, అజీమ్ పాషా, ప్రీతం,నరేష్, లతో పాటు 100మంది కార్మికులు పాల్గొన్నారు.
కార్మికుల మహాప్రదర్శనకు టీయూడబ్ల్యూజే మద్దతు
విశాలాంధ్ర – హైదరాబాద్ : దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం జరిగిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా, హైదరాబాద్ లో కార్మిక సంఘాలు నిర్వహించిన మహా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసి కల్యాణ మండపం నుండి ఇందిరా పార్కు వరకు కొనసాగిన ప్రదర్శనలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ కార్మిక సంఘాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అనుసరిస్తూ, కార్మిక, కర్షక వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టడం విచారకరమన్నారు. మోదీ సర్కారు తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 చట్టాల్లో రెండు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు రద్దయ్యాయని, ఇది జర్నలిస్టులకు తీరని ద్రోహం చేయడమేనని విరాహత్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇవ్వాళ జరిగిన మహా ప్రదర్శనలో 20 ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
ఇందిరాపార్కు వద్ద కార్మిక ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు
విశాలాంధ్ర – హైదరాబాద్ : దేశీయ పరిశ్రమలు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టే విధంగా ఏ వాణిజ్య ఒప్పందం ఉండకూడదని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో విదేశీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర ప్రభావాలు చూపుతాయని హెచ్చరించారు. గురువారం ఇందిరా పార్క్ వద్ద ఇండియా-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మిక, కర్షక సంఘాలు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించాయి. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా పారదర్శక చర్చల తర్వాతే ఏ వాణిజ్య ఒప్పందమైనా కుదుర్చుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
శ్రమజీవుల జీవితాలతో మోదీ చెలగాటం
విశాలాంధ్ర, హైదరాబాద్ : వందల ఏళ్లుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ సర్కార్ ఒకే పార్లమెంటు సమావేశంలో రద్దుచేసి నాలుగు లేబర్ కోడుల అమలుచేయడం ద్వారా కోట్లాది మంది కార్మికుల శ్రమను,కార్పొరేట్లకు కట్టబెడుతుందని, వామపక్షాల ఒత్తిడి ఫలితంగా 2005లో వచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగారుస్తూ వికసిత్ భారత్ జి రామ్ జి బిల్లును తెచ్చిందని దేశంలో 33 కోట్ల మంది రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీల నోటి కాడి బుక్క లాగేసుకుంటుందని ఆ బిల్లులు రద్దు చేయాలని సామాజిక ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా సామాజిక ప్రజాసంఘాలు నీలి జెండాలతో ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అధ్యక్షత వహించి ప్రసంగించారు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ కన్వీనర్ విమలక్క ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ జ్యోతి మల్లు లక్ష్మి ,కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.రమణ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర రాష్ట్ర నాయకులు జెరిపోతుల కుమార్, ఆరుట్ల రాజు కుమార్, వై.ఉషా శ్రీ, బాబు, బందు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు పల్లెల వీరస్వామి వశపాక నరసింహా, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోల జనార్ధన్ విసికె పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ సురుగు ప్రభాకర్ ఎన్.పి ఆర్.డి రాష్ట్ర అధ్యక్షులు కే వెంకట్ జై భీమ్ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న ప్రభు, రాణి పిఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు సరస్వతి గాదే ఝాన్సీ, డివైఎఫఐ నగర కార్యదర్శి ఎం.డి జావీద్ కెవిపిఎస్ నగర కార్యదర్శి బి.సుబ్బారావు, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎన్.బాల పీరు, జిల్లా నాయకులు దర్శనం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మె విజయవంతం
- Advertisement -


