Homeఆంధ్రప్రదేశ్అంబటిపై మరో కేసు26వరకు రిమాండ్…

అంబటిపై మరో కేసు26వరకు రిమాండ్…

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును కేసులు వెంటాడుతున్నాయి. ఒక వైపు బెయిల్ వస్తే…మరోవైపు ఇంకో కేసులో జైలుకు ఆయన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వైద్యకళాశాలలు ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఉద్యమంలో అధికారులను బెదిరించారంటూ అంబటిపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఈనెల 11న ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రాజమండ్రి జైలు నుంచి ఆయన విడుదల అవుతారనుకున్న సమయంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. 2023లో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీజేశారు. దీంతో గుంటూరు కోర్టులో అంబటిని సత్తెనపల్లి పోలీసులు గురువారం హాజరు పర్చగా…ఆయనకు ఈనెల 26వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన మళ్లీ రాజమండ్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలంటూ మరో పిటిషన్‌ను అంబటి తరపు న్యాయవాదులు వేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు