Homeజిల్లాలుతూర్పు గోదావరిమీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత కామన

మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత కామన

- Advertisement -

విశాలాంధ్ర – మండపేట : రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అరకొర నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపిందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి మాటల్లో ఉన్న మద్దతు చేతల్లో కనిపించట్లేదనీ ఆరోపించారు. గత సంవత్సరంలో రైతాంగం పండించిన ఏ పంటకు మద్దతు ధర లభించక తీవ్రమైన ఇబ్బందులెదుర్కొన్నారన్నారు. మిర్చి, పత్తి, పొగాకు, మామిడి, బొప్పాయి, మొక్కజొన్న, టమాటా తదితర పంటలు వేసిన రైతులు మద్దతు ధర అందక తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నారు. ధరల పతనం నుండి రైతులను ఆదుకునేందుకు బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్స్ స్కీమ్ కు కనీసం రూ. 5000 కోట్లయినా కేటాయించాల్సి వుండగా కేవలం 500 కోట్లతోనే సరిపెట్టారనీ దుయ్యబట్టారు. రైతులకు అండగా ఉంటామని మాటల్లో చెబుతూ నిధుల కేటాయింపు వచ్చేసరికి ఆఖరు ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకానికి 250 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. కరువు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతింటున్నాయనీ, ఇటువంటి నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేయాల్సి ఉందన్నారు. ఉచిత పంటల బీమా పథకానికి కనీసం రూ. 2500 కోట్లు కేటాయించాల్సి వుండగా బడ్జెట్లో కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కేటాయింపులు చూస్తే లబ్ధిదారుల సంఖ్యను కుదించే పనిలో ప్రభుత్వం ఉందని అర్థమవుతుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇవ్వకుండా రెండేళ్లు గా కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. కనీసం ఈ సంవత్సరమైనా కౌలు రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం ఇవ్వాలనుకుంటే బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కోసం కనీసం 10,000 కోట్లయినా నిధులు కేటాయించాలని కామన డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి దగ్గర నుండి జల వనరుల శాఖ మంత్రి వరకు పదేపదే ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు తప్పితే వాటికి నిధులు కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. అలాగే రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆదిశగా చర్యలు లేవని దీనిపై దృష్టి సారించాలని కామన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు