Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోండి..

నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోండి..

- Advertisement -

డి.ఎస్.పి హేమంత్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం ; నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం డివిజన్లోని 10 పోలీస్ స్టేషన్లో గల సిఐలకు ఎస్ఐలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో నెలవారి ప్రగతి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న నిందితులపై సమగ్రంగా సమీక్షను సీరియస్ గా చర్చించడం జరిగిందన్నారు.పునరావృత నేరాలలో పాల్గొంటున్న నిందితులను ప్రత్యేకంగా గుర్తించి, వారిపై బైండోవర్ ఫార్ఫీచర్ చర్యలు, ఎక్స్టర్న్‌మెంట్ ప్రక్రియలు మరియు అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా, రిమాండ్‌కు పంపించుట ద్వారా భవిష్యత్తులో నేరాలను అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగిందన్నారు. ప్రజా శాంతి భద్రతలను కాపాడుటలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, పునరావృత నిందితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించడం జరిగిందన్నారు. తాను ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం 10 పోలీస్ స్టేషన్లో తప్పక అమలు చేయాలని లేదా కఠిన చర్యలు తప్పవని కూడా తెలపడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు