విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయిలో టీచర్స్ గవర్నమెంట్ విజయం సాధించిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా క్రికెట్ జట్టుకు జిల్లా కలెక్టర్ రాంప్రసాద్ తన కార్యాలయం నందు అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ టీచర్ల లీప్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి టీచర్ల టోర్నమెంట్ శ్రీ సత్యసాయి జిల్లా జట్టు విజయం సాధించినందుకు ప్రతి ఒక్క క్రీడాకారుని శాలువాతో, మెమెంటోలు మరియు మెడల్స్ తో సత్కరించడం జరిగింది .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీరు ఏ విధంగా అయితే క్రీడలలో రాణించారో ,విద్యార్థులకు కూడా విద్యతో పాటు వారికి శారీరకంగా మరియు మానసికంగా తీర్చిదిద్దాలని క్రీడా ఉపాధ్యాయులు అందరికీ సూచించారు.అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యాశాఖ అధికారులైనటువంటి ,కృష్ణప్ప మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సత్యసాయి జిల్లా టీచర్స్ ఈ టోర్నమెంట్ లో గెలిచినందుకు నేనే కప్పు గెలిచినంత ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా పదవ తరగతిలో మంచి రిజల్ట్స్ సాధిస్తామని కలెక్టర్ కు విద్యాశాఖ తరఫున డిఈఓ హామీ ఇచ్చారు. సన్మాన గ్రహీతలకు షీల్డ్స్, మెడల్ శాలువాలు బహుకరించిన ఎన్విఆర్ ట్రస్ట్ అధినేత నాగేంద్రబాబు తమ తండ్రి పేరు బహుకరించి నందుకు చాలా సేవాకార్యక్రమం చేస్తున్నందుకు జిల్లాకలెక్టర్అభినందించారు.అదేవిధంగా విజయం సాధించిన సత్యసాయి జిల్లా క్రికెట్ జట్టుకు అభినందించి,సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పెనుకొండ డివైఈవో జాన్ రెడ్డప్ప ,ధర్మవరం ఎంఈఓ గోపాల్ నాయక్ , ఎస్ జి టి ఎఫ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ ,సుహాసిని , సెక్టోరల్ ఆఫీసర్ చంద్రమోహన్ సీనియర్ అసిస్టెంట్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా క్రికెట్ జట్టుకు కలెక్టర్ అభినందనలు
- Advertisement -
RELATED ARTICLES


