Homeజిల్లాలుపాలు నాణ్యత పై అనుమానాలు

పాలు నాణ్యత పై అనుమానాలు

- Advertisement -

రాజమండ్రి ఘటనతో ఉలిక్కిపడుతున్న జనం..

విశాలాంధ్ర ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలు, పాల పదార్థాల కల్తీ యదేచ్ఛగా కొనసాగుతుందని ఆర్టీసి జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఇటీవలే రాజమండ్రిలో కల్తీ పాలు పలువురి ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీ అధికారులు నిర్లక్ష్య వైఖరి మూలంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ పాలను తయారు చేస్తున్నారన్నారు. కొంతమంది దుర్మార్గపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదం జరిగితేనే మీరు స్పందిస్తారా అని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు తగినట్లు పాల ఉత్పత్తి లేక పోగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు అక్రమార్జన కోసం, కల్తీ కి పాల్పడుతున్నారన్నారు. వీటివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉన్న, అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారని, అధిక లాభాల కోసం ఒకప్పుడు రైతులు పాడి పశువులను పోషిస్తూ పాల వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఉపాధి మార్గంగా మార్చుకున్న కొందరు దళారులు ఈ వ్యాపారంలోకి వస్తున్నారు. నీళ్లు కలపని పాలు అంటూ ప్రచారం చేస్తూ, లీటర్కు 100 పైగా విక్రయిస్తున్నారు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇదే తరహాలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు వెలుస్తున్నాయి. ఇంత జరుగుతున్న పశుసంవర్ధక, ఆహార నియంత్రణ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు పశుపోషకులు పేరుతో సైకిళ్ళు మోటార్ సైకిల్ లపై దాదాపు పది నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణించి పాలు సరఫరా చేస్తున్నారు.. ఇందుకు గ్రామాల్లో పాలు సేకరించి అక్కడే ప్రాసెసింగ్ చేస్తున్నారు. కొందరు చిరు వ్యాపారులు ఎలాంటి బ్రాండ్లు లేకుండా పాలు పెరుగు నెయ్యి తదితర ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఆయా ఉత్పత్తులు నాణ్యంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలను తీసుకోవడం లేదు. నగరంలోని స్వీట్ హోమ్ యాజమాన్యం కూడా ఇదే తరహా రసాయనాలు వాడుతూ, వివిధ రకాల స్వీట్ల పేరుతో ప్రజల ఆరోగ్యానికి హానికరంగా వ్యవహరిస్తూ, వారి వ్యాపారమే ముఖ్యమనే విధంగా సంబంధిత అధికారులకు నెలకు పంపించాల్సిన మామూలు పంపిస్తే చాలు అని, వారు ఎటువంటి తినుబండారాలు అమ్మిన అధికారాలు మాత్రం పట్టించుకోరని ఆరోపించారు. మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, పైడి లక్ష్మణరావు, కూనిశెట్టి మురళి కృష్ణ, బెజవాడ నాగభూషణం, జనసేన రవి, కొండల ప్రసాద్, వాసా సాయి, ముత్యాల కొండబాబు, జనపరెడ్డి తేజ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు