చెన్నై: హీరో సూర్య నటిస్తున్న 45వ చిత్రం ‘కరుప్పు’. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో ఈ సినిమా విడుదల చర్చనీయాంశమైంది. ఆసక్తికర యాక్షన్-ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తయినా విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘డ్రీమ్ వారి యర్ పిక్చర్స’ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మిస్తు న్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా… సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. 2025 నవంబర్ నాటికే సినిమా పనులన్నీ పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, హీరో సూర్యపై దర్శకుడు ఆర్జే బాలాజీ కేసు వేయాలని భావిస్తున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా పూర్తయినా వ్యక్తిగత కారణాలతో నిర్మాత కావాలనే ఆలస్యం చేస్తున్నారని సమాచారం. ఆర్జే బాలాజీకి ఇవ్వాల్సిన పూర్తి పారితోషికం ఇంకా ఇవ్వలేదని, ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యాకే సెటిల్ చేస్తామని నిర్మాత చెప్పడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని సినీ వర్గాల సమాచారం. ఈ ఆలస్యం వల్ల దర్శకుడి కెరీర్‌కు నష్టం జరుగుతోందని, సినిమా పొటెన్షియల్ వృథా అవుతోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాలపై నిర్మాణ సంస్థ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆర్జే బాలాజీకి, నిర్మాతలకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఇవన్నీ కేవలం పుకార్లేనని వారు కొట్టిపారేస్తున్నారు. ఈ వివాదాలన్నీ సమసిపోయి సినిమా థియేటర్లలోకి వస్తే సూర్య ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమని సూర్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.


