విశాలాంధ్ర, ఘట్ కేసర్ : రోడ్డు నిర్మాణ పనుల్లో వెట్టి చాకిరి చేస్తున్న కర్మికులను గుర్తించి వారికి రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు . జాతీయ రహదారి 163 రోడ్డు నిర్మాణ పనుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి రెండు కుటుంబాలను ఇక్కడికి తరలించి వారితో వెట్టి చాకిరి చెయిస్తున్న వారిపై నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సెల్ న్యాయవాది వలిగొండ విజయరాజు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు వెట్టి చాకిరి కార్మికుల సమస్యపై పిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఘట్కేసర్ మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో యంనం పేట లేబర్ నివాస స్థలాన్ని పరిశీలించి కార్మికులను కీసర ఆర్.డి.ఓ ముందు ప్రవేశ పెట్టారు. ఇందులో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావ్య, నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ ప్రతినిధులు కె.వంశి, కె.వెంకట్ రాజు, లిబర్టీ కాస్ ఫౌండేషన్ ప్రతినిధి జె.ప్రియనాథ్, పోచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది, జిల్లా బాలల రక్షణ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


