Homeఅంతర్జాతీయంఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో పెట్టుకుంటే ఆంక్షలు తప్పవు

ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో పెట్టుకుంటే ఆంక్షలు తప్పవు

- Advertisement -

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరిక

వాషింగ్టన్: ఒక పక్క చర్చలు అంటూనే మరో పక్క అమెరికా బాహాటంగానే ఇరాన్ మÖలాలపై దెబ్బతీసే కుట్రలు చేస్తోంది. ఇరాన్ ఆర్ధిక వనరులను దెబ్బతీస్తాం అని చెపుతూ హోర్మూజ్‌ని దిగ్బంధనం చేసింది. తాజాగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ విమానయాన సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని విదేశీ కంపెనీలకు యూఎస్ ట్రెజరీ సూచించింది. అలాకాక ఎవరైనా లావాదేవీలు జరిపినట్లైతే… వారు కూడా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఎక్స్‌లో ఈ మేరకు పోస్టు పెట్టారు. ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ విమానయాన సంస్థలతో లావాదేవీలు జరిపితే, ఆయా సంస్థలు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెసెంట్ హెచ్చరించారు. విదేశీ ప్రభుత్వాల పరిధిలో ఉన్న కంపెనీలు ఇరాన్ విమానాలకు జెట్ ఇంధనం, క్యాటరింగ్, ల్యాండింగ్ ఫీజులు, నిర్వహణ వంటి సేవలను అందించకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎకనామిక్ ఫ్యూరీ కింద ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు ఎలాంటి చర్యలకైనా యూఎస్ ట్రెజరీ వెనకాడదన్నారు. ఇప్పటికే హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. ఇది టెహ్రాన్ ఆర్థిక పరిస్థితిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు అమెరికా- ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ… తాజా హెచ్చరికలు రావడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు