Homeజిల్లాలుకర్నూలుడ్రైనేజీ సమస్య పరిష్కరించాలంటూ ధర్నా

డ్రైనేజీ సమస్య పరిష్కరించాలంటూ ధర్నా

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ గురువారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పారిశుధ్యం పూర్తిగా లోపించి, రహదారిపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయం ముందే డ్రైనేజీ నీరు నిలిచి దుర్వాసన వస్తున్నా పట్టించుకోని అధికారులు, గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శి ప్రజలతో ఇంటి పన్ను అధికంగా వసూలు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ ప్రభావతి దేవికి, ఎంపీపీ శ్రీవిద్యకు, రామ్మోహన్ రెడ్డికి అందజేశారు. ఇందుకు స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు కుమ్మరి చంద్ర, తిక్కన్న, నాయకులు హనుమంతు, నాగరాజు, ఎర్రన్న, ఈరన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు