Homeజిల్లాలుతూర్పు గోదావరిదండి మార్చ్ తో మాదకద్రవ్య రహిత సమాజం నిర్మాణం

దండి మార్చ్ తో మాదకద్రవ్య రహిత సమాజం నిర్మాణం

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు నియోజక వర్గం పరిధిలోని సమిశ్రగూడెంలో వైబ్రెంట్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ నియోజకవర్గ సమన్వయకర్త విజయశ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాదకద్రవ్య రహిత సమాజం కోసం దండి మార్చ్ 2.0 ను వికాస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.ఈ సందర్బంగా మూడు వందలమంది విద్యార్థులు వంద మీటర్ల జాతీయ జెండాతో మానవహారంగా ఏర్పడి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి, మాదకద్రవ్య రహిత సమాజం నిర్మాణం బాధ్యత అంటూ నినాదాలు చేశారు. అనంతరం సమిశ్రగూడెం ఎస్సై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వికాస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.వి.వి సుధీర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి కుటుంబానికి , సమాజానికి , తన స్వంత భవిష్యత్ కి కూడా ఎంత ప్రమాదకరంగా మారుతారో వివరించారు. వీటి వలన కలిగే నష్టాలు విద్యార్థి దశనించే తెలుసుకునేలా మహాత్మా గాంధీ దండిమార్చి స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ దండి మార్చ్ 2.0 కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు రూరల్ ఎయసై చిన్నయ్య , సొసైటీ అధ్యక్షులు ఉప్పులూరి రామ్మోహన్, టీడీపీ అధ్యక్షులు జి.శ్రీనివాస్ , గ్రామ కార్యదర్శి కుంచాల శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు