సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి ..
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజా సమస్యలపై పోరాటం చేసే సిపిఐ పార్టీకు విరివిగా విరాళాలు ఇచ్చి ప్రజా పోరాటాలకు తోడ్పడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం వారు పట్టణంలోని పలు వీధులలో భారత కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలు, సేవలను ప్రజలకు వివరిస్తూ పార్టీ పంపిణీ చేసిన కరపత్రాలను వారి చేతుల మీదులుగా ప్రజలకు అందజేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ సిపిఐ 1925 నుండి 2026 వరకు 101 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో దేశంలో అనేక మూళ్ళ దారులను దాటుకొని ఎర్ర పూల వనాలను ఆవిష్కరించిందని తెలిపారు. ప్రజా సమస్యల పోరాటానికై ప్రభుత్వంతో పోరాడి ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించిందని వారు గుర్తు చేశారు. పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలని, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తోపాటు నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు, వెంకట నారాయణ, వెంకట స్వామి, శ్రీనివాసులు, యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా, మహిళ సమైక్య లింగమ్మ, లలితమ్మ,ఈరమ్మ, సిపిఐ నాయకులు తదితరులు చురుకుగా పాల్గొని పార్టీ ప్రాధాన్యత వాటి లక్ష్యం గూర్చి వివరించారు..పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ అభివృద్ధి ప్రాంతాలలో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు చొప్పున మంజూరు చేయాలి అని, లేనిపక్షంలో ఇల్లు ఇచ్చే వరకు ఇంటి అద్దెను ప్రభుత్వమే భరించాలి అని తెలిపారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు తెగ నమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ యువజన విరమించుకోవాలి అని,మహిళలకు సంపూర్ణ రక్షణ కోసం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విద్యా వైద్య రంగాల పెరుగుదలకు 14 ఏళ్లలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య కోసం, మెడికల్ మాఫియాలను అరికట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి అని తెలిపారు.


