మంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ మార్చి 14వ తేదీ నుంచి మార్చి 17 వరకు వివిధ అభివృద్ధి పార్టీ కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలలో పాల్గొంటారని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 14న గంటలకు బిజెపి ప్రతిక్షణా కార్యక్రమం, వివిధ అభివృద్ధి పార్టీ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం, రూరల్ పరిధిలో ఏర్పాటు చేసిన బిజెపి ప్రశిక్షణ కార్యక్రమం, తదుపరి ముదిగుబ్బ పట్టణంలో ఏర్పాటు చేసిన బిజెపి ప్రశిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మార్చి 16వ తేదీ నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం సంజీవపురంలోని కస్తూరి గాంధీ బాలికల పాఠశాలలో నిర్వహించే హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా కార్యక్రమం, ధర్మవరం టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు, మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే చివరి మున్సిపల్ కౌన్సిల్ కార్యక్రమం, ఎన్డీఏ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ సత్యసాయి వాటర్ వర్క్స్ పంచాయతీరాజ్ మున్సిపాలిటీ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం, తదుపరి 17వ తేదీ ఎన్డీఏ కార్యాలయంలో ఆర్ అండ్ బి నేషనల్ హైవేస్ ఏపీ ట్రాన్స్కో ఇరిగేషన్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం, పట్టణంలో నూతనంగా నిర్మించనున్న చేనేత క్లస్టర్ సైటు, ఆయుర్వేద వైద్య కళాశాల స్థలము, సద్భావన స్థలము, బీసీ భవన్ సలాలను సందర్శించుట లాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కావున ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన..
- Advertisement -
RELATED ARTICLES


