- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల కొత్తచెరువు పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి భాష ఉత్సవాల్లో భాగంగా ఆంగ్లం రీడింగ్ పోటీల్లో పట్టణంలోని సంజయ్ నగర్లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల లోని బండారు చైత్ర లక్ష్మీ ప్రథమ స్థానం లో గెలుపొందిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. తదుపరి ఈ విద్యార్థిని రాష్ట్రస్థాయిలో జరిగే భాషా ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థినీలు, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


