Homeజిల్లాలునెల్లూరుఆల్ ఇండియా గేట్ లో చరణ్ తేజ కు 129వ ర్యాంకు..

ఆల్ ఇండియా గేట్ లో చరణ్ తేజ కు 129వ ర్యాంకు..

- Advertisement -

విశాలాంద్ర వలేటివారిపాలెం (ప్రకాశం జిల్లా ) : ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన గేట్ పరీక్షలో ఈర్ల చరణ్ తేజ 129వ ర్యాంక్ సాధించాడు. గురువారం రాత్రి ఆల్ ఇండియా గేట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో వలేటివారిపాలెం మండల కేంద్రంఅయిన వలేటివారిపాలెం గ్రామం నకు చెందిన ఈర్ల శ్రీనివాసరావు సుజాత దంపతుల కుమారుడు చరణ్ తేజ 129 వ ర్యాంకు సాధించాడు. చరణ్ తేజ ఇంజినీరింగ్ నిట్ కలకత్తాలో పూర్తి చేశాడు. ప్రస్తుతం ఐఐటి మద్రాసులో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చరణ్ తేజ తండ్రి శ్రీనివాస రావు ఒక ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. తల్లి గృహిణి. జాతీయస్థాయిలో ర్యాంక్ రావడంతో గ్రామస్తులు బంధుమిత్రులు చరణ్ తేజకు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి చరణ్ తేజ మాట్లాడుతూ డి ఆర్ డి ఓ, ఇస్రో లో సైంటిస్ట్ గా పని చేయాలని లక్ష్యంగా ఉన్నానని చెప్పాడు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండి దేశానికి మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులు బంధుమిత్రులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు