ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్
ఈ నెల 24న కలెక్టర్కు అర్జీల సమర్పణ..
అర్జీల సేకరణ కార్యక్రమంలో జి కోటేశ్వరరావు
విశాలాంధ్రవిజయవాడ: నగరంలోని ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు, ఇళ్లస్థలాల సాధన కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందని పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈనెల 24 తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరోసారి అర్జీదారులు నేరుగా కలెక్టర్ అర్జీలు సమర్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 45,50 డివిజన్ల్లో నిరుపేదల నుండి అర్జీల సేకరించే కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 2024 ఎన్నికల సమయంలో ఇళ్ళు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల నివాసస్థýం ఇస్తామని, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి కూటమి నేతలు అధికారంలోకి వచ్చారని తెలిపారు. అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా సెంటు భూమి పంచకుండా నిర్లక్య వైఖరిని ప్రదర్శిస్తూ, వేలాది ఎకరాలు అప్పనంగా కార్పొరేట్ సంస్ధలకు దోచిపెడుతూ పేదలను విస్మరించడం దుర్మార్గమని మండిపడ్డారు. సొంతంటి కలను సాకారం చేసుకునేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పేదలకు న్యాయం చేసే వరకు పోరాడతామని పేర్కొన్నారు. అర్జీల సమర్ఫణలో భాగంగా నగర వ్యాప్తంగా పలు డివిజన్లలో అర్హులైన వారి చేత అర్జీలు పూర్తి చేసే కార్యక్రమం ప్రారంభించామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో 1 సెంటు వచ్చిన లబ్ధిదారులు కూడా ఈ అర్జీలు పూర్తి చేసి కలెక్టర్కు అందజేసే కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు , తాడి పైడయ్య, పంచదార్ల దుర్గంబ , 45, 50వ డివిజన్ల కార్యదర్శులు ఉప్పలపాటి శివప్రసాద్ రాజు,మోకా దుర్గారావు, స్ధానిక నాయకులు ఎర్ర సాని జోసెఫ్, పడాల తౌడమ్మ, అంజూరి సూరిబాబు,జి. కొండలరావు, నక్క నాగేశ్వరావు, టంగుటూరి ధనుంజయ్, పోలాసి వెంకటేశ్వరరావు, బల్ల నరసింహరాజు,వాతడి వెంకట రమణ, కె.సురేష్, గాడి అజయ్ తదితరులు పాల్గొన్నారు.


