విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవప్రదమైన ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. గత పాలనలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులకు ఈ బిల్లు ఆమోదంతో శాశ్వత ముగింపు లభించిందని, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధత తొలగిపోయిందని తెలిపారు. రైతుల త్యాగాలకు, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవమే ఈ నిర్ణయమని సీఎం వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంటూ, అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని స్పష్టం చేశారు. “అమరావతి ఇక అజేయం.. అజరామరం” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రులకు దక్కిన గౌరవం
- Advertisement -
RELATED ARTICLES


