హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ సష్టించగా… ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సింగిల్ ‘ఆయా షేర’ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. నాని కెరీర్లోనే సినిమా విడుదల కాకముందే 100 మిలియన్ల మైలురాయిని చేరుకున్న తొలి పాటగా ‘ఆయా షేర’ నిలిచింది. అంతేకాకుండా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ట్రాక్‌గా ఇది చరిత్ర సష్టించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్, నాని ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటలోని హుక్ స్టెప్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


