Homeజిల్లాలుశ్రీ సత్యసాయిలబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్య కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఉపశమనంగా నిలిచింది అన్నారు. ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మొత్తం 84 మంది లబ్ధిదారులకు రూ.29,84,037 లక్షల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. వైద్య చికిత్సల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా మారింది అని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య అవసరాలకు తక్షణ సహాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం , సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ భవిష్యత్తులో కూడా అవసరమున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు