Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రామస్థాయి నుండి వినియోగదారుల సంఘాల బలోపేతమే లక్ష్యం…

గ్రామస్థాయి నుండి వినియోగదారుల సంఘాల బలోపేతమే లక్ష్యం…

- Advertisement -

ధర్మవరం వినియోగదారుల సంఘం చైర్మన్ సురేష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవర;; గ్రామస్థాయి నుండి వినియోగదారుల సంఘాల బలోపేతమే లక్ష్యము అని వినియోగదారుల సంఘం చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం నందు గల మండల వినియోగదారుల సమాచార కేంద్రం నందు ధర్మవరం వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నుండి వినియోగదారులను చైతన్యపరిచేందుకు కరపత్రాలను ప్రచురించి వారికి ఏవైనా సమస్యలు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి వినియోగదారుల సమాచార కేంద్రాలను వెళ్లి వారి యొక్క సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. తద్వారా ఏదైనా వస్తువు కొని మోసపోయిన వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేశారు. తదుపరి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ధర్మవరం వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా చిన్న తంబి చిన్నప్ప, ప్రధాన కార్యదర్శిగా గుర్రం వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ గా ఎజ్జన్న సెల్వరాజ్, సహకార దర్శిగా పల్లం జనార్ధన, కోశాధికారిగా శుభహాన్ గౌరవాధ్యక్షులుగా గోవిందప్ప లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య నెంబర్ నారాయణమ్మ ,జిల్లా వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్ మండల వినియోగదారుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు