Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ సమైక్యతా శిబిరంలో బెస్ట్ వాలంటీర్స్ అవార్డ్ అందుకున్న కె.హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల

జాతీయ సమైక్యతా శిబిరంలో బెస్ట్ వాలంటీర్స్ అవార్డ్ అందుకున్న కె.హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని స్థానిక కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం. రక్షిత బెస్ట్ వాలంటీర్స్ అవార్డు అందుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని ఆదిచుంచనగిరి విశ్వవిద్యాలయం, మాండ్యలో ఏప్రిల్ 5వ, తేదీ నుండి 11 వ, తేదీ వరకు జాతీయ సమైక్యతా శిబిరంలో ఏడు రోజుల కార్యక్రమంలో పాల్గొని అనేక కార్యక్రమలలో బహుళ పనితీరును చూపుతు సంస్కృతి, సంప్రదాయాలు, శాస్త్రీయ నృత్యం, జాతీయ సేవా పథకం సేవలకు సంబంధంచిన సెమినార్లో యువతకు ప్రేరణ కల్పించారని దేశవ్యాప్తంగా 165 మంది వాలంటీర్లలో ఎం.రక్షితకు ఉత్తమ వాలంటీర్ అవార్డు రావడంలో తనప్రతిభను చూపారని తేలిపారు. డా.బి.గోపాల్ నాయక్, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ రక్షితకు (ఆంధ్రప్రదేశ్ నుండి) ఉత్తమ అవార్డు రావడం అభినంద నీయమణి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, డా. ఎస్. చిట్టెమ్మ, డా. బి. త్రివేణి, డా. ఎస్. షమీవుల్లా, ఎ.కిరణ్ కుమార్, ఎస్.పావని, వి.హైమవతి, ఎం.సరస్వతి, ఎం.పుష్పావతి, బి. ఆనంద్, ,జి మీనా, జి ధనుంజయ తదితర అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విద్యార్థులు ఎం. రక్షిత కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు