ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
తెహ్రాన్: కాల్పుల విరమణ గడువు మరో వారం రోజులే మిగిలి ఉండటంతో అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే సంప్రదింపులు జరగనున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం నేపథ్యంలో తెహ్రాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న బాహ్య ఒత్తిడి, సైనిక దురాక్రమణలను తిప్పికొట్టారు. పశ్చిమాసియాలో శత్రుత్వానికి పూర్తిస్థాయిలో ముగింపు పలికేందుకు కుదిరిన పెళుసైన కాల్పుల విరమణ, దౌత్యపరమైన చర్చల నడుమ ఇరాన్‌పై బలప్రయోగం చేసే ఏ ప్రయత్నమైనా చివరికి విఫలమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నిర్మాణాత్మక చర్చలకు కట్టుబడి ఉందని, కానీ బలవంతానికి లొంగబోదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
అమెరికాలో చట్టబద్ధంగానే చదువుకుంటున్నారన్న మంత్రి
అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరణకు గురైన ఇరాన్ విద్యార్థులు, అధ్యాపకులను ఇరాన్‌లోని అంతే సమానమైన విశ్వవిద్యాలయాల్లో చేర్చుకుంటామని, ఆ పండితులు అమెరికాలో చట్టబద్ధంగానే చదువుకుంటున్నారని ఇరాన్ శాస్త్ర, పరిశోధన, సాంకేతిక శాఖ మంత్రి హుస్సేన్ సిమాయీ సరఫ్ బుధవారం తెలిపారు. ఈ విషయాన్ని ఐఆరఎనఏ నివేదించింది.
మాపై ఏ బలప్రయోగమైనా విఫలమే
- Advertisement -
RELATED ARTICLES


