- Advertisement -
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్ పరీక్ష కేంద్రాలను గురువారం వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి సెషన్ లో 95.79 ఉండగా , అనంతపురం జిల్లాలోని ఏడు కేంద్రాలలో 97.13% హాజరు అయ్యారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు త్రాగునీరు, అత్యవసర సేవలను అందిస్తున్నారు.


