Homeజిల్లాలుఅనంతపురంపప్పూరు పంచాయతీలో సర్వేలను పరిశీలించిన ఎంపీడీవో మమతా దేవి…

పప్పూరు పంచాయతీలో సర్వేలను పరిశీలించిన ఎంపీడీవో మమతా దేవి…

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల: – మండల పరిధిలోని బి. పప్పూరు గ్రామపంచాయతీలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేతో పాటు జనగణన పనులను ఎంపీడీవో మమతా దేవి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె స్థానిక పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమీక్షించి, పారిశుద్ధ్య పనులు నిరంతరం నిర్వహించాలని, అలాగే గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్‌తో కలిసి పప్పూరు గ్రామంలో నీటి సరఫరా బోర్లు, డ్రైనేజీ వ్యవస్థను కూడా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోపాల్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు