కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం
బెంగళూర్: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెల్లవారుజామున తన ఇంట్లో దిలీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 2007లో పునీత్ రాజ్‌కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మిలానా’తో దిలీప్ రాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘యు-టర్న’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన రాణించారు. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై పలు టీవీ సీరియళ్లను నిర్మించారు. కన్నడలో కొన్ని సీరియల్స్‌లో ప్రధాన పాత్ర పోషించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆయన అకాల మరణంతో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
గుండెపోటుతో నటుడు దిలీప్ రాజ్ మృతి
- Advertisement -


