Homeఆంధ్రప్రదేశ్సత్యసాయి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

సత్యసాయి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

- Advertisement -

పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు

విశాలాంధ్ర – పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తి నియోజకవర్గంలోని రక్షణ రంగానికి చెందిన యుద్ధ విమానాల తయారీ యూనిట్ ఏర్పాటు కావడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఈ ప్రాజెక్టుతో సత్యసాయి జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పాటు వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.అదేవిధంగా ఆమడగూరు మండలంలోనే రూ.51 వేల కోట్లతో రిలయన్స్ సంస్థ భారీ సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడం ప్రాంతీయ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని వెల్లడించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుట్టపర్తి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, రాయలసీమ కోఆర్డినేటర్ దామచర్ల సత్యనారాయణ, సత్యసాయి–అనంత జిల్లాల టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, పూల నాగరాజు తదితరులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ యువనేత రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రక్షణ రంగ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో ఏర్పాటు కావడం గర్వకారణమని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రాజెక్టు రాకతో పుట్టపర్తి నియోజకవర్గం రూపురేఖలే మారిపోతాయని, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, కార్యదర్శి ఎల్ఐసి నరసింహులు, యువ నాయకులు గంగాధర్ నాయుడు, రామారావు, లక్ష్మణరావు, సీనియర్ నాయకులు రాయల్ మురళి, జెఎల్ మురళి, సురేష్, గౌస్ముద్దీన్, తాజ్, అంబులెన్స్ రమేష్, సురేష్ చౌదరి, కృష్ణప్రసాద్, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు