స్పందన ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం తో పాటు పరిసర ప్రాంతంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తగిన ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని స్పందన ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్ ,డాక్టర్ సోనియా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగాలు చేయని పేద ఎస్సీ, ఎస్టీ తల్లిదండ్రుల పిల్లలకు, వారి చదువుల కోసం మా స్పందన ఆసుపత్రి తగిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. అర్హులైన వారు తగిన ఆధార పత్రాలతో తమ చిరునామా, ఫోన్ నెంబర్ తో హాస్పిటల్ లో రిసెప్షన్ లో ఈ నెల అనగా మే 20వ తేదీ లోపల అందజేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
పదవ తరగతి ప్రతిభ కలిగిన మార్కులకు ఆర్థిక సహాయం అందజేస్తాం..
- Advertisement -
RELATED ARTICLES


