సినిమా: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. 21న చిత్ర నిర్మాణం ప్రారంభానికి యÖనిట్ సిద్ధమైంది. సంక్రాంతికి ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో చిరు మాంచి జోష్ మీదున్నారు. అదే జోష్‌తో కొత్త సినిమాకు సమాయత్తం అయ్యారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి దర్శకత్వం వహించిన బాబీయే ఈ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి జోడీతో ఆ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి జోడీతో రూపొందుతున్న రెండో చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణంపై అధికారకి ప్రకటన వెలుపడింది. 21న పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు చిరు ఆదివారం సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో ఆయన పంచుకున్నారు. ఈ సినిమాలోని కొత్త లుక్ కోసం ఆయన పడుతున్న కష్టాన్ని, శరీరాకృతిని మార్చుకునేందుకు ఆయన చేస్తున్న కసరత్తుల్ని వీడియోలో చూపించారు. అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా మాస్ అంశాలతో కూడిన గొప్ప యాక్షన్ కథతో ఈ సినిమా ముస్తాబు కానుంది. చిరు ఇందులో రెండు కోణాల్లో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి తెరపైకి తెచ్చేందుకు చిత్ర బృందం ప్రణాళికలు చేస్తోంది.
21న చిరంజీవి 158వ సినిమా ప్రారంభం
- Advertisement -
RELATED ARTICLES


