విశాలాంధ్ర ధర్మవరం : హెచ్ఐవి మృతులకు, ఎయిడ్స్ బారిన పడి మృతి చెందిన వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం అనంతపురం వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ క్యాండిల్ లైట్ డే దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, శక్తి మైత్రి మహిళా సంఘం, స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణమ్మ, వైద్య సిబ్బంది వారు కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ నవీన్ కుమార్, మొబైల్ ఐసిటిసి కౌన్సిలర్లు నరేంద్ర వనమాల, మండల వినియోగదారుల సంఘం అధ్యక్షులు చిన్నప్ప ,తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఐవి మృతులకు నివాళులు
- Advertisement -
RELATED ARTICLES


