Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరం

విద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరం

- Advertisement -

గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం:; విద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరమని, అప్పుడే భవిష్యత్తులో ముందంజలో ఉంటారని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి శిక్షణా తరగతులకు ఎల్ఐసి నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంగ్లీష్ గ్రామర్ బోధించడం జరిగిందన్నారు. తదుపరి నీతి పద్యాలు, నీతి కథలు, పుస్తకాలను చదివించుట చేయడం జరిగిందన్నారు. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. నేటి ఈ శిక్షణా కార్యక్రమంలో 38 మంది విద్యార్థులు రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు పాల్గొనడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రాము, శివమ్మ, రమణా నాయక్, గంగాధర్, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు